News March 17, 2025
రాష్ట్రపతి అల్పాహార విందులో బైరెడ్డి శబరి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతికి నమస్కారం చేశారు. రాష్ట్రపతి ఆహ్వానాన్ని ఎంతో గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాని శబరి తెలిపారు.
Similar News
News March 18, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ల మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనిని ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
News March 18, 2025
మహేశ్ బాబు ఔదార్యం.. ఫ్రీగా 4500 హార్ట్ ఆపరేషన్స్!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య నిన్నటితో 4500+కు చేరినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రతా ప్రారంభించారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.
News March 18, 2025
కోదాడ: చోరీకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

చర్చిలో దొంగతనానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కోదాడ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక చర్చిలోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. నిర్మాణం కోసం తీసుకొచ్చిన కొత్త కిటికీలు, డోర్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించగా కాపలా వ్యక్తులు గమనించి కేకలు వేశారు. పారిపోయే క్రమంలో రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.