News March 18, 2025

విజయవాడ: సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-లోకమాన్య తిలక్(LTT) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.18519 VSKP- LTT రైలు ఏప్రిల్ 24, నం.18520 LTT- VSKP ఏప్రిల్ 22 నుంచి మౌలాలి, సికింద్రాబాద్‌లో ఆగదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు ఆయా తేదీలలో చర్లపల్లి మీదుగా నడుస్తున్నాయన్నారు.

Similar News

News March 18, 2025

కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు

image

కోడుమూరులోని కర్నూలు రహదారిలో ఉన్న మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహం తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల కన్వీనర్ రమేశ్ నాయుడు, కృష్ణారెడ్డి దగ్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.

News March 18, 2025

నాగారం: పురుగు మందు పాయిజన్‌గా మారి రైతు మృతి

image

వరి పొలానికి రైతు పురుగు మందు కొట్టగా, అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన నాగారం మండలం ఈటూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కొమ్ము మహేశ్ తన పొలంలో రెండు రోజులు పురుగు మందు స్ప్రే చేశాడు. అది బాడీ పాయిజన్ అయి మంగళవారం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 18, 2025

సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

image

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌ ఉన్నారు.

error: Content is protected !!