News March 18, 2025
యాప్‌లలో బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు: నిర్మల్ ఎస్పీ

యాప్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడినా, గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరైనా ప్రోత్సహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చిరిస్తున్నారు.
Similar News
News January 7, 2026
NTR జిల్లాను రహదారి భద్రతలో నెం.1గా నిలపడమే లక్ష్యం: కలెక్టర్

ఎన్‌టీఆర్ జిల్లాను రహదారి భద్రతలో నెం.1గా నిలుపుదామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా విజయవాడ ఎంజీ రోడ్–ఈట్ స్ట్రీట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రహదారి భద్రత వాక్‌థాన్‌ను ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.
News January 7, 2026
₹5800 CRతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర నదిని సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News January 7, 2026
జోగి రమేశ్‌ను జైల్లో ఇబ్బంది పెడుతున్నారు: వెల్లంపల్లి

రాష్ట్ర ప్రజలు అందరూ ఈ అరాచక ప్రభుత్వాన్ని గమనిస్తున్నారని మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం విజయవాడలోని సబ్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌తో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాసరావు ములాఖాత్ అయ్యారు. 67 రోజులుగా బీసీ నాయకున్ని నిర్బంధించి జైల్లో నుంచి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. లోకేశ్ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు.


