News March 24, 2024

కర్నూలు: యువ ఓటర్లే కీలకం

image

కర్నూలు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల లోపు వారే దాదాపు 50 శాతంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 20 నుంచి 29 ఏళ్ల లోపు వాళ్లు 6,90,703 మంది ఉండగా 30 నుంచి 39 ఏళ్ల వాళ్లు 9,63,220 మంది ఉన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నాయకుల భవితను నిర్ణయించేందుకు వీళ్లు సిద్ధంగా ఉన్నారు.

Similar News

News September 29, 2024

2న జిల్లాస్థాయి స్కేటింగ్ ఎంపిక పోటీలు

image

జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో అక్టోబర్ 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి పక్కిరెడ్డి తెలిపారు. ఇన్లైన్, క్వాడ్ స్కేటింగ్ క్రీడాంశలలో రింక్ రేస్, రోడ్ రేస్‌లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు RSFI పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారు నవంబర్ 6-10వ తేదీ వరకు కాకినాడలో జారిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News September 29, 2024

రేపు నందికొట్కూరులో జాబ్ మేళా

image

నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ సునీత తెలిపారు. 10వ తరగతి, ఆపై చదివిన నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు tinyurl.com/jobmelagdcndk లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

News September 29, 2024

అక్టోబర్ 1న పత్తికొండకు సీఎం రాక: కలెక్టర్

image

అక్టోబర్ 1న పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఉదయం 11.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 12.30 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి పుచ్చకాయలమడకు వస్తారని చెప్పారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో సంభాషిస్తారన్నారు.