News March 18, 2025
నిర్మల్: 522 మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 522 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తం 7343కి 6821 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News September 13, 2025
యునెస్కో జాబితాలో ఎర్రమట్టి దిబ్బలు

యునెస్కో జాబితాలో రెడ్ సాండ్ హిల్స్ చేరాయి. కోస్తా తీరంలోని భీమిలి మండలం నేరెళ్లవలస సమీపంలో ధవళ వర్ణంలో ముచ్చట గొలిపే ఈ ఎర్రమట్టి దిబ్బలు క్వాటర్ నరీ యుగానికి చెందినవని శాస్త్రవేత్తల అంచనా. 2.6మిలియన్ సంవత్సరాల నుంచి వివిధ రూపాంతరాలు చెంది ఇవి ఏర్పడినట్లు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. యునెస్కో గుర్తింపుతో ప్రంపంచ వ్యాప్తంగా విశాఖ పేరు వినపడనుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
News September 13, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

వరంగల్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొత్తం జిల్లా వ్యాప్తంగా 18.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. వీటిలో ఎక్కువ వర్షం నెక్కొండ మండలంలో 14.9 మి.మీగా నమోదు కాగా, పర్వతగిరిలో 2.7 మి.మీ, రాయపర్తిలో 0.5 మి.మీ వర్షం కురిసింది.
News September 13, 2025
ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.