News March 18, 2025
బెల్లంపల్లి: KU డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి: శంకర్

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ శంకర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కోఆర్డినేటర్ MD.రఫీ తెలిపారు. కళాశాలలో BA, Bcom, Bscచదువుతున్న 2వ,4వ,6వ సెమిస్టర్ విద్యార్థులు ఈ మేరకు నిర్ణయించిన ఫీజులు ఆన్ లైన్‌లో చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు కాకతీయ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించిందన్నారు.
Similar News
News November 4, 2025
6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.
News November 4, 2025
వరి మాగాణుల్లో పంట ఎంపిక.. ఇవి ముఖ్యం

వరి మాగాణుల్లో పంట ఎంపికకు ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. రైతులు ఎంపిక చేసుకునే ప్రత్యామ్నాయ పంటలకు స్థిరమైన మార్కెట్, మద్దతు ధర ఉండేలా చూసుకోవాలి. కనీస మద్దతు ధర, పంట భీమా, నాణ్యమైన విత్తనాలు సకాలంలో లభించే పంటలను ఎన్నుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఎన్నుకునే పంటలు తక్కువ నీటిని వినియోగించుకొని, దిగుబడిని అందించేవి అయ్యి ఉండాలి.
News November 4, 2025
రబీలో వరికి బదులు ఆరుతడి పంటలతో లాభాలు

రబీ కాలంలో వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం 2 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పంట మార్పిడి వల్ల పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు తగ్గుతాయి. నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది.


