News March 18, 2025

నిర్మల్: రెవెన్యూ ఉద్యోగిపై దాడి.. కలెక్టర్ చర్యలకు ఆదేశం

image

ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణలో ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం రాత్రికి ఒక ప్రకటనలో తెలిపారు. తానూరు మండలం బోరిగామ గ్రామంలో రెవెన్యూ ఉద్యోగిపై దాడి ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు.

Similar News

News November 3, 2025

చెత్తవేసే వారి ఫొటోలు పంపిస్తే ₹250 నజరానా

image

నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యం కోసం గ్రేటర్ బెంగళూరు అథారిటీ, BSWML కొత్త స్కీమ్‌ చేపట్టాయి. రోడ్లపై చెత్తవేసే వారి ఫొటో, వీడియో తీసి పంపిస్తే ₹250 చెల్లిస్తామని ప్రకటించాయి. త్వరలోనే దీనికోసం డెడికేటెడ్ నంబర్, SM హ్యాండిల్స్‌, ప్రత్యేక యాప్‌ ఏర్పాటు చేయనున్నాయి. కాగా 5వేల ఆటోలతో ఇంటివద్దే చెత్త సేకరిస్తున్నా కొందరు ఇంకా రోడ్లపై వేస్తున్నారని, వారికి ₹2వేల ఫైన్ విధిస్తామని BSWML CEO తెలిపారు.

News November 3, 2025

బస్సుల్లో ఈ నియమాలు తప్పనిసరి: ఆర్టీఓ మురళి మోహన్

image

1.⁠ ⁠ఎమర్జెన్సీ ఎగ్జిట్ లు (అత్యవసర నిష్క్రమణ)
2.⁠ ⁠ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టం
3.⁠ ⁠ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టం.
4.⁠ ⁠ఫైర్ extinguishers
5.⁠ ⁠డైమండ్ టైప్ హామర్స్
6.⁠ ⁠కోచ్ సక్రమ లేఅవుట్.

News November 3, 2025

హనుమకొండ: 15న ప్రత్యేక లోక్ అదాలత్

image

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్ వి.బి. నిర్మలా గీతాంబ తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకు, చిట్‌ఫండ్, క్రిమినల్‌, సివిల్‌, కుటుంబ కేసులు పరిష్కారానికి అవకాశం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. కక్షిదారులు, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.