News March 18, 2025

అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.

Similar News

News September 18, 2025

గుంటూరులో డయేరియా కేసులు

image

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ తెలిపారు. 

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.

News September 18, 2025

కాకినాడ: ఏపీలోనే తొలిసారిగా.. మన తలుపులమ్మ లోవలో..!

image

ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ ఆలయంలో రూ.4 కోట్లతో ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొండప్రాంతం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఎస్కలేటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్న మొదటి దేవాలయం తలుపులమ్మ లోవ కానుంది.