News March 18, 2025

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

image

ఉమ్మడి కరీంనగర్,​ మెదక్,​ నిజామాబాద్,​ ఆదిలాబాద్​ టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Similar News

News November 15, 2025

ఢిల్లీకి నవీన్ యాదవ్.. మతలబ్ ఏంటి?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్‌కు ఢిల్లీలో ప్రశంసలు వచ్చాయి. CM రేవంత్, dy.CM భట్టి, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. జూబ్లీలోని బస్తీ వాసులు గెలిపించిన నాయకుడు ఢిల్లీకి వెళ్లడం తాజా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పట్టులేని చోట కాంగ్రెస్‌ను నిలబెట్టిన యూసుఫ్‌గూడ బస్తీ వాసికి అదనపు బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా? అనే చర్చ మొదలైంది.

News November 15, 2025

బౌద్ధం పరిఢవిల్లిన పల్నాడు

image

పల్నాడు అంటే పౌరుషాలు, పట్టింపులు, యుద్ధాలు గుర్తుకొస్తాయి. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.
అహింస, శాంతిని, విజ్ఞానాన్ని ప్రబోధించే బౌద్ధ, జైన మతాలు పల్నాడులో ఫరిడవిళ్లాయి. నాగార్జునసాగర్‌లో ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వ విద్యాలయ అవశేషాలు నేటికీ ఉన్నాయి. మాచర్ల, కొదమగుండ్ల ప్రాంతంలో లభించిన బౌద్ధ అవశేషాలు మ్యూజియంలో ఉన్నాయి. అమరావతి బౌద్ధ స్తూపం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.