News March 18, 2025
ప్రభుత్వ స్థలాలను గుర్తించండి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ సబ్ స్టేషన్లకు 5 నుంచి 10 ఎకరాలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాలను గుర్తించాలని సూచించారు.
Similar News
News March 18, 2025
పానగల్: విద్యార్థులు పెద్ద కలలు కనండి: జిల్లా ఎస్పీ

పానగల్ మండలం మహమ్మదాపూర్ ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం,10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ హాజరయ్యారు. పాఠశాల జీహెచ్ఎం ఆనంద్,ఉపాధ్యాయ బృందం, మాజీ సర్పంచ్ జయరాములు సాగర్ వారికి స్వాగతం పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాధించాలన్నారు.
News March 18, 2025
NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.
News March 18, 2025
HYD: సీఎంను కలిసిన బీసీ సంఘాల నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.