News March 24, 2024
సంగారెడ్డి: తండ్రి మృతి.. పుట్టెడు దుఃఖంతో పరీక్ష కేంద్రానికి

కళ్ల ముందే కన్నతండ్రి నిర్జీవంగా మారగా.. ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో పదోతరగతి పరీక్షకు హాజరైన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లా పుల్కల్ మండలంలో చోటుచేసుకుంది. గొంగ్లూరుకు చెందిన ఆకుల గొంగయ్య(41) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. అతని మొదటి కుమార్తె భవాని పదోతరగతి చదువుతోంది. ఓవైపు తండ్రి మృతితో కన్నీటి పర్యంతం అవుతూనే.. మరోవైపు శనివారం జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంది.
Similar News
News March 10, 2026
అవయవ మార్పిడి పాలసీపై మంత్రి సమీక్ష

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అవయవ మార్పిడి చట్టం(THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి దామోదర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవయవ దానాలను ప్రోత్సహించే విధంగా విధానాలను సరళీకృతం చేయాలని, చికిత్స ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి తెలిపారు.
News March 10, 2026
‘మినిట్ టు మినిట్’ ప్రణాళికను సిద్ధం చేయాలి: కలెక్టర్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 12న ప్రజాప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణపై కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. శిక్షణకు సంబంధించి ‘మినిట్ టు మినిట్’ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
News March 10, 2026
భూ హక్కుల కోసమే రీ-సర్వే: అదనపు కలెక్టర్

భూములపై పక్కా హక్కులు కల్పించేందుకే రీ-సర్వే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలం అక్కన్నపేటలో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో రూపొందించిన నక్షల్లో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయడమే ఈ సర్వే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.


