News March 18, 2025
బాపట్ల: బయోమెట్రిక్ ఆధారంగా సచివాలయ సిబ్బందికి జీతాలు

సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసము నుంచి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన అన్నారు.
Similar News
News November 10, 2025
గణాంక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో 7వ చిన్న నీటిపారుదల గణాంక వివరాల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సహజ, మానవ నిర్మిత బోరుబావులు, చెరువులు, కుంటలు, కాలువలు తదితర చిన్న నీటిపారుదల వివరాలన్నింటినీ సమగ్రంగా సేకరించాలని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన సూచించారు.
News November 10, 2025
రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చునన్నారు.
News November 10, 2025
అకోలా-కాచిగూడ రైలులో ఒకరి హత్య

అకోల నుంచి కాచిగూడ వెళ్లే రైలులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి సోమవారం తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఉమ్మడి గ్రామానికి చెందిన అతిశ రైలులో వాటర్ బాటిల్ అమ్ముకుంటూండగా, అదే గ్రామానికి చెందిన షేక్ జమీర్ వాటర్ బాటిల్ విషయంలో గొడవ పడ్డారు. దీంతో జమీర్ గాజు సీసాతో అతిశపై దాడి చేయగా మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కరికెల్లి, ధర్మాబాద్ మధ్యలో జరిగింది.


