News March 18, 2025
SKLM: ప్రభుత్వ ఉద్యోగులకు కంప్యూటర్ శిక్షణ

ప్రభుత్వ శాఖల నుంచి ఇద్దరు లేదా ముగ్గురుకి మార్చి 18 నుంచి 22 వరకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జడ్పీ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల నుంచి ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి సత్వరమే అందజేయాలన్నారు. కంప్యూటర్ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్స్, అడ్వాన్స్ టూల్స్‌పై శిక్షణ ఇస్తామన్నారు.
Similar News
News March 18, 2025
టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెక్కలిలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆకతాయిల పనే అని పలువురు అంటున్నారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
News March 18, 2025
కోటబొమ్మాళి: బంధువులకు విద్యార్థి అప్పగింత

కోటబొమ్మాళి మండలంలోని జగనన్న కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థి ఆదివారం పరారైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్లో బాలుడి ఆచూకీ దొరికింది. వాట్సాప్ పోస్టుల ద్వారా ఓ వ్యాపారి బంధువులకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం విద్యార్థి పిన్ని వచ్చి తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు.
News March 18, 2025
ఎచ్చెర్లలో దారుణ హత్య

ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమ్మ (40) ను భర్త అప్పలనాయుడు కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. హత్యకు కుటుంబంలో గొడవలే కారణమని సమాచారం.