News March 18, 2025
పార్వతీపురంలో పీజిఆర్ఎస్‌కు 121 వినతులు

వినతుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 121 మంది అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
Similar News
News September 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 18, 2025
ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News September 18, 2025
శుభ సమయం (18-09-2025) గురువారం

✒ తిథి: బహుళ ద్వాదశి రా.12.25 వరకు
✒ నక్షత్రం: పుష్యమి ఉ.8.59 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.6.38-ఉ.8.10