News March 18, 2025
మెదక్: దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు.
Similar News
News March 18, 2025
మెదక్: పరువు తీశాడని చంపేశారు

ఏడుపాయలలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేశారు. CI రాజశేఖర్ రెడ్డి వివరాలిలా.. రామతీర్థం వాసి నవీన్ కుమార్, సంగారెడ్డికి చెందిన వినోద్ రెడ్డి, రమాణాచారి, రాములుపై FEB 17న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో నవీన్ రిక్వెస్ట్ చేస్తుండగా, వినోద్ దురుసుగా మాట్లాడటంతో ఇలా జరిగిందని, దీంతో పరువు పోయిందని వారు భావించారు. ఈనెల 8న మద్యం మత్తులో ఉన్న వినోద్ను ముగ్గురు కలిసి హత్య చేశారు.
News March 18, 2025
సంగారెడ్డి: వరకట్నం వేధింపులకు వివాహిత బలి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాయికోడ్ మండలం నాగన్పల్లికి చెందిన మహేశ్వరి(22)కి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో పెళ్లైంది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించడంతో మనస్తాపం చెందిన మహేశ్వరి సోమవారం ఉదయం ఉరేసుకుంది.
News March 18, 2025
మెదక్: బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని హవేలీఘనపూర్ గురుకులం ప్రిన్సిపల్ విజయనిర్మల తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2 లక్షల ఆదాయ పరిమితి మించరాదని వివరించారు.