News March 18, 2025
జనగామ: ఇంటర్మీడియట్ పరీక్షల సరళి పరిశీలించిన కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని సోమవారం జనగామ జిల్లాలోని ధర్మకంచలోని ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరును అధికారుల నుంచి తెలుసుకున్నారు.
Similar News
News July 6, 2025
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ADB SP

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలకు గురైన
వారు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. గతవారం జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్

రెండో టెస్టులో భారత్ సంధించిన భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమని, పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు. తామేమీ పిచ్చోళ్లం కాదని గెలుపు కుదరకపోతే డ్రా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ‘ఒక్క రోజులో 550కుపైగా పరుగులు చేయడం అసాధ్యం. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం ఆపరు’ అని ఆయన స్పష్టం చేశారు.
News July 6, 2025
NTR: కృష్ణా నదిలో భవిష్య స్కూల్ అధినేత డెడ్ బాడీ

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని కృష్ణా నది నుంచి వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.