News March 18, 2025

మార్చి18 : చరిత్రలో ఈ రోజు

image

*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మాగాంధీకి 6 సంవత్సరాల జైలుశిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1953: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1986: సినీనటుడు సుశాంత్ జననం

Similar News

News March 18, 2025

ఐదు సినిమాలు.. దేనికోసం వెయిటింగ్?

image

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ఐదు కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా వస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’, హీరో నితిన్ నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’, మోహన్ లాల్ నటిస్తోన్న ‘ఎల్2: ఎంపురాన్’, హీరో విక్రమ్ ‘వీర ధీర శూర’ పార్ట్-2తో పాటు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘సికందర్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇంతకీ మీరు ఏ సినిమాకు వెళ్తారు? కామెంట్ చేయండి.

News March 18, 2025

మైనార్టీలపై వేధింపుల ఆరోపణలు.. ఖండించిన యూనస్ ప్రభుత్వం

image

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలను యూనస్ ప్రభుత్వం ఖండించింది. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. తమ దేశానికి అపవాదు తెచ్చేలా ఆమె మాట్లాడారని మండిపడింది. భారత్ పర్యటనలో ఉన్న తులసి బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆమె కలిశారు.

News March 18, 2025

ఆ విషయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: గోదావరి నుంచి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్‌లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు.

error: Content is protected !!