News March 18, 2025
బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.
Similar News
News November 24, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే

ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 198, ఎస్సీ 32, బీసీ 20, జనరల్ 85 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
News November 24, 2025
తిరుపతిలో ఇవాళ బంగారం రేటు ఎంతంటే?

తిరుపతి జిల్లాలో సోమవారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,583గా ఉంది. 22 క్యారెట్లు రూ.11,534, 18 క్యారెట్లు రూ.9437 చొప్పున విక్రయిస్తున్నారు. పది రోజుల కిందట 24 క్యారెట్ల బంగారం గ్రాము 12,508గా ఉండేది. మరోవైపు ఇవాళ సిల్వర్ కేజీ రూ.1,71,900గా ఉంది. పది రోజుల కిందట కేజీ వెండి రూ.1.75,000 పలకగా.. ఇవాళ సుమారు రూ.3వేలు తగ్గింది.
News November 24, 2025
నల్గొండ సర్కారు దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం..!

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం రేపుతోంది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈ దవాఖానలోని పరిపాలన విభాగంలో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈనెల 26 లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.


