News March 18, 2025

జగిత్యాల: కనుమరుగవుతున్న ఎడ్ల బండ్లు!

image

నాగరికత అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడ్ల బండి. పూర్వం రైతులు ప్రతి అవసరానికి ఎడ్ల బండిని వాడేవారు. ప్రస్తుత రోజుల్లో ఎడ్ల బండి కనుమరుగై మ్యూజియంలో బొమ్మగా మారింది. జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్ బండ్లు వచ్చినప్పటి నుండి ఎడ్ల పనులను ఉపయోగించడం తగ్గింది. రైతులు ఎడ్లను తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది.

Similar News

News March 18, 2025

కాకినాడ: పరువుగా బతికి.. అప్పులపాలై ఆత్మహత్య

image

కాకినాడ రూరల్ పండూరుకు చెందిన బావిశెట్టి వెంకటేశ్వరరావు (48) ట్యాంకర్స్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలై స్వగ్రామంలో ఉండలేక హైదరాబాద్ వెళ్లిపోయారు. 2నెలల్లో వస్తానని చెప్పి వెళ్లిన ఆయన నెల గడవకముందే నిన్న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. నేడు మృతదేహం స్వగ్రామానికి రానుంది.

News March 18, 2025

NZB: నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు నూతన బస్సులు

image

నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేటకు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు NZB-2 డిపో మేనేజర్ సాయన్న సోమవారం తెలిపారు. ఈ బస్సులు నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నడపనున్నట్లు వెల్లడించారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ఆదరించాలని తెలిపారు.

News March 18, 2025

మైనార్టీలపై వేధింపుల ఆరోపణలు.. ఖండించిన యూనస్ ప్రభుత్వం

image

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలను యూనస్ ప్రభుత్వం ఖండించింది. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. తమ దేశానికి అపవాదు తెచ్చేలా ఆమె మాట్లాడారని మండిపడింది. భారత్ పర్యటనలో ఉన్న తులసి బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆమె కలిశారు.

error: Content is protected !!