News March 18, 2025
కరీంనగర్: ఉద్యోగుల సేవలు అభినందనీయం: కలెక్టర్

తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డీ కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్, నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడంలో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
నూతన ట్రాఫిక్ స్టేషన్ కార్యాలయాలను ప్రారంభించిన సీపీ

KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో నూతనంగా తీర్చిదిద్దిన ACP, CI, సిటీ రైటర్ కార్యాలయాలను CP గౌస్ అలాం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DCP వెంకటరమణ, ACPలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరి స్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, CIలు కరిముల్లా ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ఈ నూతన కార్యాలయాలు దోహదపడతాయని CP పేర్కొన్నారు.
News October 31, 2025
KNR: మైనారిటీ గురుకులాల్లో లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కరీంనగర్, మానకొండూర్, జమ్మికుంట గురుకులాల్లోని ఈ పోస్టులకు PG, B.Ed అర్హత ఉన్నవారు నవంబర్ 6వ తేదీ లోగా కరీంనగర్ జిల్లా మైనారిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
News October 31, 2025
KNR: ‘విజిలెన్స్ మనందరి సంయుక్త బాధ్యత’

ఆర్టీసీలో OCT 28 నుంచి NOV 2 వరకు నిర్వహించుచున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా KNR బస్టాండ్ ఆవరణలో KNR RM బి.రాజు, జోనల్ విజిలెన్స్ & సెక్యూరిటీ అధికారి ఎం.రవీందర్, డిప్యూటీ RMలు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం సిబ్బందితో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. RM మాట్లాడుతూ.. విజిలెన్స్ మనందరి సంయుక్త బాధ్యత అన్నారు. ప్రతి ఉద్యోగి విధుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగిన సంస్కృతిని పెంపొందిస్తామన్నారు.


