News March 18, 2025

టెన్త్ పరీక్షలు.. నల్గొండ డీఈవో ముఖ్య గమనిక 

image

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై ఇదివరకే అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు భయం వీడి మంచిగా పరీక్షలు రాయాలని సూచించారు. 

Similar News

News January 15, 2026

NLG: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో!

image

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో వర్గపోరు పార్టీల్లో గందరగోళం సృష్టిస్తోంది. BJP పుంజుకుంటున్న తరుణంలో వర్గపోరు నేతలకు తలనొప్పిగా మారగా, కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, DCC అధ్యక్షుడు పున్నా కైలాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు కార్పొరేషన్‌ తమదే అంటూ BRS వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం ఎవరిదో కామెంట్ చేయండి.

News January 15, 2026

నల్గొండలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

1. నల్గొండ కార్పొరేషన్ 48: ST 1,SC 7, BC 16, UR 24
2. చండూర్ 10: ST 1, SC 1, BC 3, UR 5.
3.చిట్యాల 12: ST 1, SC 2, BC 3, UR 6.
4.దేవరకొండ 20: ST 3, SC 2, BC 5, UR 10.
5.హాలియా12: ST 1, SC 2, BC 3, UR 6.
6.మిర్యాలగూడ 48: ST 3, SC 5, BC 16, UR 24.
7.నకిరేకల్ 20: ST 1, SC 3, BC 6, UR 10.
8.నందికొండ 12: ST 1, SC 2, BC 3, UR 6.

News January 15, 2026

NLG: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!

image

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్రం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు.. ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం.. మరోవైపు అవగాహన లేమి.. వెరసి పంటల ఆన్లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి. జిల్లాలో 5,65,782 మంది రైతులకు గాను ఇప్పటివరకు 30,953 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,34,953 మంది రైతులు రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్నారు.