News March 18, 2025

MNCL: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

image

ఏప్రిల్ 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం లాజిస్టిక్ సేవ విభాగం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే కళ్యాణ తలంబ్రాలు పంపిణీకి బుకింగ్‌ను సోమవారం మంచిర్యాల ఆర్టీసి డిపో మేనేజర్ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్యాణం జరిగిన తర్వాత ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారు 7382841860, 9866771482, 9154298541 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Similar News

News July 4, 2025

పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్.. ఏం చేయాలి?

image

HYDలో ‘కిలోమీటర్ దూరానికి గంట పట్టింది’ అని వే2న్యూస్‌లో పోస్ట్ అయిన <<16941177>>వార్తకు<<>> యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కరి ప్రయాణం కోసం కార్లను వాడటం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమని అంటున్నారు. కంపెనీలన్నీ ఒకే చోట ఉన్నాయని, వాటిని వివిధ ప్రాంతాలకు తరలించాలని మరికొందరు సూచించారు. మెట్రో, ఆర్టీసీ లాంటి ప్రజారవాణాకు పెద్దపీట వేయాలంటున్నారు. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏం చేయాలో కామెంట్ చేయండి.

News July 4, 2025

విశాఖలో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు.. డిజైన్లు ఇవే

image

విశాఖలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో 50 అంతస్తుల 3BHK, 4 BHK ఫ్లాట్స్, 4BHK డూప్లెక్స్ ఫ్లాట్స్‌ని V.M.R.D.A నిర్మించనుంది. సర్వే నంబర్ 331/1 లోని 4.07 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. 6 టవర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. జాయింట్, PPP పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతారు. విశాఖలో ఇప్పటివరకు 50 అంతస్తులు అపార్ట్మెంట్లు లేవు.

News July 4, 2025

V.M.R.D.A. పరిధిలో అభివృద్ధి పనులకు ఆమోదం

image

విశాఖలో V.M.R.D.A. బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పలు అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా కొత్తూరులో 5.68 ఎకరాల్లో పార్కు నిర్మించనున్నారు.‌ వేపగుంట-పినగాడి మధ్య 60 అడుగుల రోడ్డు నిర్మిస్తారు. మధురవాడ, మారికవలస, వేపగుంటలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు అమోదం తెలిపారు. ఛైర్మన్ ప్రణవ గోపాల్, ఎంసీ విశ్వనాథన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.