News March 18, 2025
ములుగు: అనుమానస్పద స్థితిలో మహిళా మృతి..?

కాటాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఈశ్వరి పక్కింటి వారితో గొడవపడ్డారని.. అనంతరం ఆమె ఇంట్లో మృతిచెంది కనిపించిందని తెలిపారు. ఈశ్వరి ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యనా.? ఆత్మహత్యనా.? అనే కోణంలో విచారిస్తున్నారు.
Similar News
News March 18, 2025
మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్‌వో

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
News March 18, 2025
సిద్ధార్థ్‌ను అభినందించిన సీఎం

అనంతపురానికి చెందిన 14ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ నంద్యాల సీఎం చంద్రబాబును కలిశారు. ఏఐ సాయంతో గుండెజబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన సిద్ధార్థ్‌ను సీఎం అభినందించారు. అరగంట పాటు అతడితో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని బాలుడిని సీఎం ప్రోత్సహించారు. కాగా సిద్ధార్థ్ రూపొందించిన యాప్ 7 సెకన్లలోనే గుండె పనితీరు చెప్పేస్తుంది.
News March 18, 2025
50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

AP: పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై YCP MLCలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ₹4వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం ₹వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే మేం రాగానే ₹1,000 పెంచాం. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నాం’ అని తెలిపారు.