News March 18, 2025
TGPSC ఫలితాల్లో సత్తా చాటిన ‘అయిజ’ యువతి

సోమవారం TGPSC విడుదల చేసిన ఫలితాల్లో అయిజ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రాణెమ్మ దేవన్న చిన్న కుమార్తె అయిన సునీత గట్టు గురుకులాల్లో చదివి, SC స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటిన ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సునీత తెలిపింది. ఉద్యోగం సాధించినందుకు తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News March 18, 2025
NZB: నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు నూతన బస్సులు

నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేటకు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు NZB-2 డిపో మేనేజర్ సాయన్న సోమవారం తెలిపారు. ఈ బస్సులు నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నడపనున్నట్లు వెల్లడించారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ఆదరించాలని తెలిపారు.
News March 18, 2025
మైనార్టీలపై వేధింపుల ఆరోపణలు.. ఖండించిన యూనస్ ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలను యూనస్ ప్రభుత్వం ఖండించింది. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. తమ దేశానికి అపవాదు తెచ్చేలా ఆమె మాట్లాడారని మండిపడింది. భారత్ పర్యటనలో ఉన్న తులసి బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆమె కలిశారు.
News March 18, 2025
సంగారెడ్డి: ఇంటి వద్దకే భద్రాచలం తలంబ్రాలు

భద్రాచలం సీతారాముల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభులత మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు లాజిస్టిక్ కేంద్రాలు రూ.150 చెల్లించి బుక్ చేసుకోవాలని చెప్పారు. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటికి వచ్చి తలంబ్రాలను తమ సిబ్బంది అందిస్తారని పేర్కొన్నారు.