News March 18, 2025
సంగారెడ్డి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌లో స్టేట్ ర్యాంక్

సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కి చెందిన జనార్దన్ రెడ్డి సోమవారం విడుదలైన గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2024 జూన్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు పరీక్ష జరిగింది. ఈ క్రమంలో జోన్లో 21 ర్యాంక్, స్టేట్‌లో 176వ ర్యాంక్ సాధించిన జనార్దన్ రెడ్డికి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగం వరించింది. జనార్దన్ రెడ్డి ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
Similar News
News March 18, 2025
కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు

కోడుమూరులోని కర్నూలు రహదారిలో ఉన్న మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహం తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల కన్వీనర్ రమేశ్ నాయుడు, కృష్ణారెడ్డి దగ్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.
News March 18, 2025
నాగారం: పురుగు మందు పాయిజన్‌గా మారి రైతు మృతి

వరి పొలానికి రైతు పురుగు మందు కొట్టగా, అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన నాగారం మండలం ఈటూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కొమ్ము మహేశ్ తన పొలంలో రెండు రోజులు పురుగు మందు స్ప్రే చేశాడు. అది బాడీ పాయిజన్ అయి మంగళవారం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 18, 2025
సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు.