News March 18, 2025
కుబీర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్ (48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికిరాలేదని తన కుమారుడు చేన్లోకి వెళ్లి చూడగా కరెంట్ షాక్‌కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Similar News
News September 15, 2025
అల్లూరి: తుపాకీనే కాదు.. ‘కాటా’ కూడా కంపల్సరీ!

సాధారణంగా పోలీసుల విధుల్లో భాగంగా తుపాకీ తీసుకెళ్తుంటారు. కానీ అల్లూరి జిల్లాలో పోలీసులకు మాత్రం తుపాకీతో అదనపు బరువు ఒకటి తోడైంది. అదే వేయింగ్ మెషీన్. ఎందుకంటారా? ఏజెన్సీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని అక్కడికక్కడే తూకం వేయాల్సి వస్తోంది. దీంతో వేయింగ్ మెషీన్ తీసుకెళ్లడం వారికి తప్పనిసరి అయింది.
News September 15, 2025
మేడ్చల్ జిల్లాలోని B.Ed కాలేజీలకు క్యాండిడేట్స్ లాగిన్

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న B.Ed కాలేజీల్లో సీటు పొందిన క్యాండిడేట్స్ వివరాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేక లాగిన్ అందుబాటులో ఉంచినట్లుగా ఓయూ అధికారులు తెలిపారు. ఒక్కో కాలేజీలో 20- 30 సీట్ల వరకు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాండిడేట్స్ వివరాలతో కూడిన ప్రత్యేక షీట్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
News September 15, 2025
ఉద్దేశపూర్వకంగానే బకాయిల ఎగవేత: కవిత

TG: కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.