News March 18, 2025
సంగారెడ్డి: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

నారాయణఖేడ్ నియోజకవర్గ భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగన్ పల్లికి చెందిన 22 ఏళ్ల పోగుల మహేశ్వరికి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించారు. సోమవారం ఉదయం మహేశ్వరి ఉరి వేసుకుని మరణించింది.
Similar News
News March 18, 2025
నాగారం: పురుగు మందు పాయిజన్‌గా మారి రైతు మృతి

వరి పొలానికి రైతు పురుగు మందు కొట్టగా, అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన నాగారం మండలం ఈటూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కొమ్ము మహేశ్ తన పొలంలో రెండు రోజులు పురుగు మందు స్ప్రే చేశాడు. అది బాడీ పాయిజన్ అయి మంగళవారం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 18, 2025
సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు.
News March 18, 2025
రేపు బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరుకానున్నారు. రేపు ఆయన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్‌తో భేటీ కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. రేపు సాయంత్రం CBN తిరిగి అమరావతికి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.