News March 18, 2025

సంగారెడ్డి: ఈతకు వెళ్లిన యువకుడు మృతి

image

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి మండలం కల్పగురు శివారులోని మంజీరా డ్యాంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన నరేష్ తమ్ముడు నరేంద్రతో కలిసి ఆదివారం మంజీరా డ్యామ్‌కు వెళ్లారు. నరేష్ ఈత కొడుతుండగా నదిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 18, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌కు మళ్లీ రప్పించారు

image

కామారెడ్డి జిల్లాలో 15మంది తహసిల్దార్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బదిలీల్లో ప్రేమ్ కుమార్‌ను అధికారులు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఇంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే ప్రేమ్ కుమార్ డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి డీఎఓగా పంపగా మళ్లీ అతనినీ అధికారులు కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.

News March 18, 2025

మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్‌వో

image

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.

News March 18, 2025

సిద్ధార్థ్‌ను అభినందించిన సీఎం

image

అనంతపురానికి చెందిన 14ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ నంద్యాల సీఎం చంద్రబాబును కలిశారు. ఏఐ సాయంతో గుండెజబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన సిద్ధార్థ్‌ను సీఎం అభినందించారు. అరగంట పాటు అతడితో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని బాలుడిని సీఎం ప్రోత్సహించారు. కాగా సిద్ధార్థ్ రూపొందించిన యాప్‌ 7 సెకన్లలోనే గుండె పనితీరు చెప్పేస్తుంది.

error: Content is protected !!