News March 18, 2025
రాజోలి: TGPSC ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా యువకుడు

ఇవాళ TGPSC విడుదల చేసిన ఫలితాల్లో గద్వాల జిల్లా యువకుడు సత్తా చాటాడు. రాజోలి మండలంలోని పెద్ద తాండ్రపాడు గ్రామానికి చెందిన కృష్ణ- చిన్నమ్మల కుమారుడు ప్రసాద్ హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా ఒకవైపు కాకతీయ యూనివర్సిటీలో MEDచదువుతు హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సన్నద్ధమైనట్లు ఆయన తెలిపారు. మండల ప్రజలు అభినందనలు తెలియజేశారు.
Similar News
News November 12, 2025
‘ఫ్రీహోల్డ్’ రిజిస్ట్రేషన్లపై నిషేధం పొడిగింపు

AP: ఫ్రీహోల్డ్(యాజమాన్య హక్కుల కల్పన) భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఓ అంచనాకు రాలేకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు నిషేధాన్ని పొడిగించారు.
News November 12, 2025
కేయూ: 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.
News November 12, 2025
SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

<


