News March 18, 2025
నల్గొండ: మరో GOVT జాబ్ కొట్టిన టీచర్

నల్లగొండ రూరల్ మండలం ST కాలనీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న G.మౌనిక ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2 ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్గా సెలెక్ట్ అయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, తోటి ఉపాధ్యాయులు ఉద్యోగం అభినందించారు. ఓవైపు టీచర్ జాబ్ చేసుకుంటూ పట్టుదలతో చదివి హాస్టల్ వెల్ఫేర్గా సెలెక్ట్ అయ్యారని కొనియాడారు.
Similar News
News January 12, 2026
NLG: కల చెదిరి.. కళ తప్పి

ఉమ్మడి జిల్లాలో గంగిరెద్దులను ఆడించే వారి జీవనం కష్టతరంగా మారింది. ఆదరణ కరువై, పొట్టకూటి కోసం వేరే పనులు చూసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సందర్భంగా రంగు రంగుల బట్టలు, గంటలు, మువ్వలతో ఇంటింటికీ తిరిగి అలరించే డూడూ బసవన్నల గొంతులు మూగబోతున్నాయి. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం పెరగడం, వినోద సాధనాలు మారడంతో ఈ కళ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. రాను రాను అంతరించిపోయిన జాబితాలో చేరేలా కనిపిస్తోంది.
News January 12, 2026
NLG: సర్కార్ మాటలకే పరిమితం.. కొత్త పథకం ఎక్కడా?

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా ప్రభుత్వం మరిచిపోయిందని వృద్ధులు మండిపడుతున్నారు. జిల్లాలో వేలాదిమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
News January 12, 2026
NLG: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందా.. విద్యాశాఖ మౌనమెందుకు?

కార్పొరేట్ పాఠశాలలు పబ్లిసిటీ పేరుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ సహా పలు కేంద్రాల్లో విద్యార్థుల నుంచి ప్రోగ్రాంల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. కేవలం వండర్ లా విహారయాత్ర పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2500 వరకు గుంజుతున్నట్లు సమాచారం. ఇలాంటి వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


