News March 18, 2025

సిద్దిపేట: యువకుడి ఆత్మహత్య

image

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకి మండలంలో జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాలు.. మండలంలోని నరసింహులపల్లికి చెందిన కుసుంబ సాయి (22) కడుపునొప్పి భరించలేక సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. మృతుని తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News September 16, 2025

నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

image

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.

News September 16, 2025

విషాదం.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

image

AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్థిని నాగమణి(18) హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితులతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. వారితో మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారు.

News September 16, 2025

ఇంట్లో శంఖం ఉంచవచ్చా?

image

ఇంట్లో శంఖం ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ‘శంఖం ఊదడం వల్ల పాపాలు నశిస్తాయి. వాస్తు దోషాలు తొలగి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి, విష్ణువులకు శంఖం ప్రియమైంది. ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోనే ఉంటుంది. శంఖం ఊదడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి’ అని అంటున్నారు.