News March 18, 2025

కామారెడ్డి: కోతి కల్లు తాగితే..!

image

ముందే కోతి.. ఆపై కల్లు తాగితే.. అనే సామెత నిజమనిపిస్తోంది ఈ చిత్రం చూస్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక చెట్టు వద్ద చెట్టు నుంచి కల్లు దింపిన గౌడన్న కింద మోటార్ సైకిల్‌కు కల్లు బిందెను ఉంచి మరో చెట్టు పైకి కల్లు కోసం వెళ్లగా ఇదే అదనుగా చూసిన కోతి కల్లును ఎంచక్కా తాగింది. అనంతరం నెమ్మదిగా జారుకుంది. ఇది చూసిన కొందరు ముందే కోతి.. ఆపై కల్లు తాగింది.. ఇప్పుడెలా అంటూ చర్చించుకున్నారు.

Similar News

News July 10, 2025

చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్: హీరా లాల్

image

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News July 10, 2025

NGKL: ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉషారాణి

image

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉషారాణి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆస్పత్రి సిబ్బందితో కలిసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. అంతకుముందు ఆస్పత్రి సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.

News July 10, 2025

PIC OF THE DAY

image

TG: గురుపౌర్ణమి వేళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నిశీధిలో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుండగా గోపురంపై నిండు చంద్రుడు ఆసీనుడైనట్లు కనిపిస్తున్న చిత్రం కనువిందు చేస్తోంది. కాగా గురుపౌర్ణమి సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.