News March 18, 2025

పల్నాటి యుద్ధం ఎందుకు జరిగింది?

image

పల్నాటి చరిత్ర పై విస్తృత చర్చ జరగాలని వక్తలు ఉద్ఘాటించారు. గామాలపాడులో పల్నాటి నాగమ్మ శైవ క్షేత్రం పునః ప్రతిష్ఠ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 11వ శతాబ్దం నాటి పల్నాడు చరిత్రలో బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడు కాగా, నాగమ్మ శైవ భక్తురాలు. అప్పట్లో శైవం, వైష్ణం, సంప్రదాయం, సంస్కరణల మధ్య యుద్ధం అని కొందరు అంటుంటారు. దాయాదుల పోరుగా కొందరు అభివర్ణిస్తున్నారు. మీరేమంటారు కామెంట్ చేయండి.

Similar News

News September 16, 2025

GST ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన మదర్ డెయిరీ

image

GST శ్లాబులను సవరించిన నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. లీటర్ పాల ధర ప్రస్తుతం రూ.77 ఉండగా రూ.75కు తగ్గించామని తెలిపింది. నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్స్ రేట్లనూ తగ్గించినట్లు వెల్లడించింది. పాలపై సున్నా, మిగతా ఉత్పత్తుల(పనీర్, బట్టర్, చీజ్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్)పై 5% జీఎస్టీ ఉంటుందని తెలిపింది.

News September 16, 2025

GDK: ‘సెలవులకు ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి’

image

దసరా సెలవులకు ఊర్లకు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి DCP P.కరుణాకర్‌ సూచించారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వారికి సమాచారం ఇస్తే పెట్రోలింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఊర్లకు వెళ్తే విలువైన వస్తువులను ఇండ్లలో వదిలి వెళ్లవద్దని, బ్యాంక్‌ లాకర్‌లో భద్ర పరుచుకోవాలని సూచించారు. ఇంటిని గమనిస్తూ ఉండాలని చుట్టూ పక్కల వారికి తెలిపి వెళ్లాలని సూచించారు.

News September 16, 2025

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

image

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.