News March 18, 2025
ఎన్టీఆర్: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ (2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్, సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 28లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
Similar News
News January 5, 2026
జగిత్యాల: సీసీ కెమెరాల పని తీరును పరిశీలించిన కలెక్టర్

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతినెల నిర్వహించే ఈవీఎం గోదాము తనిఖీల్లో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా దారూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను ఆయన పరిశీలించారు. గోదాములో పటిష్టమైన భద్రత ఉండాలని, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
News January 5, 2026
10 నిమిషాల్లోనే సమస్యకు వరంగల్ కలెక్టర్ చెక్

ప్రజావాణిలో 10 సంవత్సరాలు పూర్తికాని సమస్యను పది నిమిషాల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిష్కరించారు. దరఖాస్తుదారుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్యపై తీవ్ర ఆవేశంతో వచ్చారు. సమస్య పరిష్కారం కావడంతో ప్రశాంతంగా వెళ్లారు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
News January 5, 2026
పోలవరం-నల్లమల సాగర్.. విచారణ వాయిదా

SCలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది. కేటాయింపులకు విరుద్ధంగా AP నీళ్లను వాడుకుంటోందని TG వాదించింది. అయితే ప్రాజెక్టు నివేదిక, అధ్యయనానికి కేంద్రం అనుమతి తీసుకున్నామని AP తెలిపింది. TG గోదావరిపై వందల ప్రాజెక్టులు నిర్మిస్తోందని వాదించింది. పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని SC వ్యాఖ్యానించింది.


