News March 18, 2025
రాజమండ్రి: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యుల క్రీడా పోటీలు

ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు ఆహ్లాదాన్ని ఇచ్చే దిశగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో 173మంది ఎమ్మెల్యేలు, 31మంది క్రికెట్, 25 మంది బ్యాట్మెంటిన్ వాలీబాల్ ఆడనున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News October 27, 2025
ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత: కలెక్టర్

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని APSDMA రెడ్ అలర్ట్ ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం సూచించారు. 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవవద్దని హెచ్చరించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
News October 26, 2025
సెలవు రోజులలో పాఠశాలలో తెరిస్తే కఠిన చర్యలు: DEO

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు 27, 28 తేదీలలో 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు DEO కంది వాసుదేవరావు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే పునరావాసం కోసం HMలు అందుబాటులో ఉండి పాఠశాల భవనాలు ఇవ్వాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవు దినాలలో రూల్స్ బ్రేక్ చేస్తూ పాఠశాలలు తెరిచిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని DEO హెచ్చరించారు.
News October 26, 2025
రాజమండ్రి: పాపికొండల విహారయాత్ర బోట్ల నిలిపివేత

తుపాన్ కారణంగా రాజమండ్రి నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరే బోట్లను నిలిపివేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.


