News March 18, 2025

విశాఖ స్టేడియంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్

image

విశాఖ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఇవాళ ఆ టీమ్ సారథి అక్షర్ పటేల్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది విశాఖలో జరగనున్న ఈ తొలి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Similar News

News March 18, 2025

విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

image

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

News March 18, 2025

ఎంవీపీ కాలనీ: ప్రేయసికి పెళ్లయిందని యువకుడి అదృశ్యం

image

ప్రేయసికి పెళ్లయిందని ఓ యువకుడు అదృశ్యమైన ఘటన ఎంపీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవెంకోజిపాలెంలో ఉంటున్న యువకుడు(20) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన ప్రేయసికి పెళ్లయిందని తెలిసి ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 18, 2025

విశాఖ: అదనపు కోచ్‌లతో రైళ్ల పెంపు

image

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. రైలు నెం. 58506/58505 విశాఖపట్నం – గుణుపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ 1×8 నుంచి ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది. రైలు నం. 18512/ 18511 విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 17 తేది నుంచి రెండు స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది.

error: Content is protected !!