News March 18, 2025
నాగర్‌కర్నూల్: కానిస్టేబుల్ ఇంట్లో పాము కలకలం

స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లోని ఓ కానిస్టేబుల్ ఇంట్లో నాగుపాము దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో పోలీస్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అటుఇటు తిరుగుతూ మంచం కిందికివెళ్లడంతో సభ్యులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ వంశీకి కాల్ చేయడంతో అతను రెస్క్యూ చేసి పట్టుకున్నాడు. అందరు ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News January 10, 2026
భూపాలపల్లి: గొంతెమ్మగుట్టపై పురాతన చిత్రకళ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఆది మానవుల చరిత్రను, సంస్కృతిని రికార్డు చేస్తున్న డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, టీం సభ్యులు తాజాగా గొంతెమ్మ గుట్టను సందర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం ప్రతాపగిరి శివారులో ఉన్న చిన్న గుట్టపై మొదటగా బొప్పారం రాజు, రాజేందర్ ధర్మరాజు బృందం ఒక చిత్రాన్ని గుర్తించారు.
News January 10, 2026
విద్యుత్ లైన్లకు దూరంగా.. సంక్రాంతి జరుపుకోండి: ఎస్ఈ

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు. లోహపు పూత ఉండే చైనా మాంజా వాడటం వల్ల విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీగలకు పతంగులు చిక్కుకుంటే కర్రలతో తీయడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే 1912 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
News January 10, 2026
కల్తీ నెయ్యి కేసుపై అధికారుల సమీక్ష

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సీబీఐ సిట్ అధికారులు తిరుపతిలోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారని తెలుస్తుంది. కేసు మూడో ఛార్జ్ షీట్.. ఇప్పటి వరకు జరిగిన తీరు.. ఇక జరగాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


