News March 18, 2025

రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య

image

రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకి చెందిన ఆర్.సంజనా ప్రియ (19) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సీఐ సన్యాసినాయుడు సోమవారం రాత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వంట చేయకుండా టీవీ చూస్తున్న యువతిని మందలించారు. అనంతరం యువతి క్షణికావేశంలో గడ్డిమందును తాగింది. కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందజేస్తుండగా మృతి చెందిందని సీఐ చెప్పారు.

Similar News

News January 15, 2026

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. రూ.100 కోట్ల ఆదాయం

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా TGSRTC ఈ నెల 9 నుంచి 14 వరకు 6 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపింది. ఈ ఆరు రోజుల్లో సుమారు 2.40 కోట్ల మంది ప్రయాణించడం ద్వారా రూ.100 కోట్ల వరకూ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి APSRTC బస్సులు హైదరాబాద్‌కు రాకపోవడం కూడా కలిసొచ్చింది. పండుగ తర్వాత జనవరి 18, 19 తేదీల్లోనూ స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

News January 15, 2026

కర్నూలు: ‘యువకుడి మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే చెప్పండి’

image

కర్నూలు(M) పంచలింగాల డెయిరీ ఫారం నిర్వహిస్తున్న బ్రహ్మానంద రెడ్డి(30) నిన్న తెల్లవారుజామున నుంచి కనిపించకుండా పోయాడు. రోజూలాగే పాలు పోసేందుకు వెళ్లిన బ్రహ్మానంద రెడ్డి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కేసీ కెనాల్ సమీప హైవేపై అతని బైక్ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు 4వ పట్టణ PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ విక్రమ్ సింహ తెలిపారు.

News January 15, 2026

మార్స్ కోసం ఆహారం.. రూ.6.75 కోట్ల ఆఫర్

image

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్: మార్స్ టు టేబుల్’ అనే ఛాలెంజ్‌ను ప్రారంభించింది. మార్స్‌కి ప్రయాణించే ఆస్ట్రోనాట్ల కోసం వేరే గ్రహంపై కూడా పెరిగి, వండుకొని తినగలిగే ఆహారం రూపొందించే వారికి 7.5 లక్షల డాలర్లు (సుమారు రూ.6.75 కోట్లు) ఇస్తామని NASA ప్రకటించింది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని సూచించింది. ప్రపంచంలోని ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపింది.