News March 18, 2025

చిగురాకు తొడిగిన భారతావని ‘చివరి’ అంచు!

image

ఆకాశం అందమైన కాన్వాస్ అయితే దానిపై ప్రతి రోజు రూపుదిద్దుకున్న చిత్రాలెన్నో. కళాత్మకంగా కూడిన మనసు ఉండాలే కానీ ఆకాశంలో ఉండే మేఘాలు, ఏపుగా పెరిగిన చెట్లు ఎన్నో రకాల అద్భుతమైన రూపంలో కనిపిస్తాయి. వరంగల్ నగరంలోని నర్సంపేట రోడ్డులో పచ్చని చెట్ల కొమ్మలు భారతదేశ పటం చివరి భాగం రూపంలో పచ్చదనంతో అల్లుకొని ఉన్న చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

Similar News

News November 1, 2025

వెనిజులాపై దాడులు చేస్తారా? ట్రంప్ ఏమన్నారంటే

image

వెనిజులాలో కొకైన్ ఫెసిలిటీస్, డ్రగ్ ట్రాఫికింగ్ రూట్లపై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వచ్చిన <<18162638>>వార్తలను<<>> ప్రెసిడెంట్ ట్రంప్ ఖండించారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. మరోవైపు కరీబియన్, ఈస్టర్న్ పసిఫిక్‌లో గత నెల నుంచి ఇప్పటివరకు 15 అనుమానిత డ్రగ్ స్మగ్లింగ్ బోట్లపై యూఎస్ దాడులు జరిపింది. ఈ ఆపరేషన్లలో ఇప్పటివరకు 61 మంది మరణించారు. కాగా పడవలపై దాడుల్ని ఆపేయాలని USను UN కోరింది.

News November 1, 2025

నేడు శ్రీసత్యసాయి జిల్లాలో CM CBN పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో మ.12.45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించనున్నారు. పెన్షన్ లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.

News November 1, 2025

పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

image

‘బాహుబలి’ యూనివర్స్‌లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?