News March 24, 2024
మోదీని ’28 పైసా PM’ అని పిలుద్దాం: ఉదయనిధి

తమిళనాడు రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయి పన్నుకి రూ.28 పైసలే కేంద్రం వెనక్కి ఇస్తోందని మండిపడ్డారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు లబ్ధి జరుగుతోందని అన్నారు. ఇక నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ’28 పైసా పీఎం’ అని పిలుద్దామంటూ ఫైర్ అయ్యారు. తమిళనాడుపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.
Similar News
News November 15, 2025
BREAKING: అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ అని సూచించింది.
News November 15, 2025
గ్యాస్‌లైటింగ్ గురించి తెలుసా?

మానసిక వేధింపుల్లో ‘గ్యాస్‌లైటింగ్’ ఒకటి. దీన్ని అనుసరించే వారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారితో స్నేహం చేస్తూనే వారిని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో తమపై తమకు నమ్మకం పోయేలా, తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. మానసికంగా బలహీనంగా ఉండే వారితో ఇలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారిని క్రమంగా బలహీనుల్ని చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడమే వీరి లక్ష్యం.
News November 15, 2025
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాహుల్ అభినందన

తెలంగాణ సీఎం రేవంత్, PCC చీఫ్ మహేశ్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించినందుకు రాహుల్ వారిని అభినందించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


