News March 18, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో యువతులతో వ్యభిచారం.. ARREST

image

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్‌సుఖ్‌‌నగర్‌లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.

Similar News

News December 30, 2025

డేంజర్‌లో హైదరాబాద్‌

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ మంగళవారం తెల్లవారుజామున 285కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈసమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT

News December 30, 2025

HYD: మహిళలకు ఉచిత శిక్షణ

image

HYDలో మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, HYD పోలీసుల సహకారంతో MOWO Social Initiatives భాగస్వామ్యంతో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. మహిళా ప్రయాణికుల కోసం బైక్ టాక్సీ, e-ఆటో డ్రైవింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఉచిత శిక్షణ, లైసెన్స్ సాయం, వాహన లీజ్/ లోన్ సదుపాయం అందించనున్నారు. JAN3న అంబర్‌పేట్ PTCలో ఈ మేళా జరగనుంది.

News December 30, 2025

రేపు రాత్రి దద్దరిల్లనున్న హైదరాబాద్

image

డిసెంబర్ 31ST.. ఈవెంట్లు, చిల్ మూమెంట్ల నైట్ ఇది. సిటీలో యువత పెద్ద ఎత్తున ప్లాన్‌ వేసుకుంటోంది. పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు సాయంత్రం నుంచే కళకళలాడనున్నాయి. కొందరు పబ్లిక్ స్పాట్‌లకు ప్రిఫరెన్స్ ఇస్తుంటే.. మరి కొందరు ఫ్యామిలీతో కలిసి 31ST దావత్‌‌కు తమ ఇళ్లనే వేదిక చేసుకుంటున్నారు. మార్కెట్‌లోని DJ షాపుల్లో డాన్స్‌ ఫ్లోర్లు, స్పీకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రేపు రచ్చ.. రచ్చే.