News March 18, 2025

NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

image

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News March 19, 2025

బడ్జెట్‌లో నిజామాబాద్‌కు కావాలి నిధులు

image

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 19, 2025

ధర్మారంలో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

image

ధర్మారం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గానూ సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని అధికారులు మంగళవారం రోజున సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రసన్న కుమారి, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు.

News March 19, 2025

CM తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.

error: Content is protected !!