News March 18, 2025

NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

image

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో గత నెల 14వ తేదీన బాలికిపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News January 14, 2026

ప్రధాని మెచ్చిన కాకినాడ యువకుడి ఐడియా

image

కాకినాడ జిల్లా కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన యువకుడు కొరుప్రోలు శివ మణికంఠ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. ఈనెల 12న ఢిల్లీలో జరిగిన ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026’లో ఆయన పాల్గొని, వ్యవసాయ రంగంలో తనకున్న వినూత్న ఆలోచనలను ప్రధాని మోదీ సమక్షంలో ప్రదర్శించారు. శివ మణికంఠ టాప్-5 ఐడియా విభాగంలో నిలవడం విశేషం. ఈ యువకుడి ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News January 14, 2026

బుల్లెట్ బండిని గెలుచుకున్న గుంటూరు కోడి పుంజు

image

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.

News January 14, 2026

NRPT: సంక్రాంతి పండగ పూట విషాదం..

image

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నేతాజీ (36) దుర్మరణం చెందారు. మక్తల్ నుంచి రాయచూర్ వెళ్తున్న లారీ, అదే మార్గంలో వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నేతాజీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్సై నవీద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పండుగ పూట ఈ ప్రమాదం విషాదం నింపింది.