News March 24, 2024
ప్రకాశం: DMHOకు ఏడీగా ఉద్యోగోన్నతి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మికి వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి లభించింది. ఆమె ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మికి ఆడిషనల్ డైరెక్టర్ (స్పెషల్) హోదా కల్పిస్తూ ఇక్కడే పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న DMHO పోస్టును అప్‌గ్రేడ్ చేసి ఇక్కడే కొనసాగే విధంగా వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో తెలిపారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.
News January 13, 2026
ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 13, 2026
సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.


