News March 18, 2025
ఎన్టీఆర్: అమరావతిలో నిర్మాణ పనులకు క్యాబినెట్ ఆమోదం

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి పలు అంశాలకు ఆమోదం లభించింది. సీఆర్డిఏ ఆధ్వర్యంలో జరిగే 22 పనులకు L1 బిడ్డర్లను అనుమతించేందుకు, ఏడీసీఎల్ ఆధ్వర్యంలో జరిగే రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనులకు పరిపాలనా అనుమతులకు క్యాబినెట్ ఓకే చెప్పింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ పనులకు సంబంధించి కరెన్సీ సీలింగ్ క్లాజ్ అగ్రిమెంట్‌లో సవరణను ఆమోదించింది.
Similar News
News March 19, 2025
గద్వాలలో దారుణం..!

గద్వాల మండలం చేనుగోనిపల్లిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధులపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. అనాథలైన వృద్ధులపై మానవమృగాలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు గద్వాల ఆసుపత్రికి తరలించారు. కాగా వృద్ధుల్లో ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరికి మతిస్థిమితం సరిగా లేదు.. మానవత్వం మరిచి వృద్ధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
News March 19, 2025
చిన్నారులపై స్పెషల్ ఫోకస్: మహబూబ్‌నగర్ కలెక్టర్

శిశు గృహాల్లో ఉన్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఫెర్నాండెజ్ ఫౌండేషన్, జీజీహెచ్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. చిన్నారులు ఇంటి వాతావరణం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. శిశు గృహాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.
News March 19, 2025
సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్‌లోని ఝాలసన్‌లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.