News March 18, 2025
ములుగు: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News November 6, 2025
ఊట్కూర్: నేల మట్టమైన వరి పంట

ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా ఊట్కూరు మండల కేంద్రంలోని పెద్ద జెట్రం అమ్మనికి చెందిన రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శివారులో వేసిన వరి పొలాలు నీట మునిగి సుమారు 50 ఎకరాల వరి పంట నష్టం చేతికొచ్చిన పంటలు నీటి పాలవడంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పంట నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి రైతులను ఆదుకోవాలని మాజీ MPTC కిరణ్ డిమాండ్ చేశారు.
News November 6, 2025
IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<
News November 6, 2025
ఊట్కూర్: మారనున్న పెద్ద చెరువు రూపురేఖలు

నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ఊట్కూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువును విస్తరించి రిజర్వాయర్‌గా మార్చనున్నారు. దీని నిలువ సామర్థ్యం 0.27 టీఎంసీలు. 19 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రెషర్ మెయిన్ పద్ధతిలో జయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్ ఎత్తిపోస్తారు. భూసేకరణ జరిగిన, డబ్బు రైతు ఖాతాలో జమ కాలేదు.


