News March 24, 2024
VZM: నారా లోకేశ్‌ని కలిసిన TDP MLA అభ్యర్థులు

విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, బేబీ నాయన, కొండపల్లి శ్రీనివాస్ శనివారం విజయవాడలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేనతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
Similar News
News April 10, 2025
రేగిడి: పోక్సో కేసులో నలుగురి అరెస్ట్

విజయనగరం జిల్లా రేగిడి మండలానికి చెందిన జగదీశ్ ఈనెల 26న అదే మండలానికి చెదిన బాలికను ప్రేమ పేరుతో విజయవాడ తీసుకెళ్లిపోయాడు. బాలిక కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో జగదీశ్‌తో పాటు అతనికి సాయం చేసిన మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు బుధవారం తెలిపారు.
News April 9, 2025
బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ ఈశ్వరరావు బుధవారం తెలిపారు. రెండో ప్లాట్‌ఫామ్‌పై మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడి ఆచూకీని తెలిపే ఎటువంటి ఆధారాలు తమకు దొరకలేదని అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పడితే బొబ్బిలి రైల్వే పోలీసులను సంప్రదించాలని హెచ్‌సీ ఈశ్వరరావు కోరారు.
News April 9, 2025
VZM: ‘డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమయ్యే డీఎస్సీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురజాడ అప్పారావు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ కె.జ్యోతిశ్రీ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో గల కస్పా హైస్కూల్ వద్ద ఉన్న ఏపీ బీసీ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 11వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు. బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు.