News March 18, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.

Similar News

News December 30, 2025

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

image

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.

News December 30, 2025

శివతత్వం: కరుణామయ సంకల్పం

image

మూడో కంటితో విశ్వాన్ని భస్మం చేసే కాలరుద్రుడైనప్పటికీ భక్తుల పట్ల అపారమైన కరుణ చూపే భోళాశంకరుడి నుంచి మనమెంతో నేర్చుకోవాలి. తనను నమ్మిన వారిని ఆదుకోవడానికి ఎంతటి సాహసానికైనా పూనుకుంటాడు. బలహీనులను రక్షిస్తూ, ఆర్తులను ఆదుకుంటడు. తోటివారి పట్ల కరుణ చూపి, ఇతరుల తప్పులను క్షమించే గుణం అలవర్చుకోవడమే నిజమైన శివతత్వం. ప్రతికూలతలను జయించి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం శివుడి నుంచి నేర్చుకోవాలి.

News December 30, 2025

MAIDSలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..

image

న్యూఢిల్లీలోని మౌలానా అజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(<>MAIDS<<>>)లో 17 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డెంటల్ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.67,700-రూ.2,08,700 చెల్లిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://maids.delhi.gov.in/