News March 18, 2025
IPL మ్యాచ్: HYDలో భారీ బందోబస్తు

IPL అభిమానులకు అసౌకర్యం కలగకుండా క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో IPL నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ క్రికెట్ ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్ పరిసరాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఉంటుంది.
Similar News
News December 28, 2025
హాదీ హంతకులు భారత్‌లోనే ఉన్నారు: ఢాకా పోలీసులు

బంగ్లా పొలిటికల్ యాక్టివిస్ట్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు. ‘ఫైసర్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ స్థానికుల సాయంలో మైమన్‌సింగ్‌లో బార్డర్ క్రాస్ చేశారు. భారత్‌లో వారిని పూర్తి అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నారు. సామీ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయాలో తురా సిటీకి తీసుకెళ్లారు. భారత అధికారులను సంప్రదిస్తున్నాం’ అని అడిషనల్ కమిషనర్ నజ్రూల్ తెలిపారు.
News December 28, 2025
త్వరలో పాలమూరుకు కేసీఆర్: శ్రీనివాస్ గౌడ్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధుల సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని విమర్శించారు.
News December 28, 2025
గాలిపటం కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

TG: గాలిపటం కొనివ్వలేదని రెండో తరగతి చదువుతున్న బాలుడు(9) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మహబూబ్‌నగర్(D) చిల్వేర్‌లో జరిగింది. రాజు-శ్రీలత దంపతుల కుమారుడు సిద్ధూ పతంగి కొనివ్వమని అడగగా నిరాకరించారు. దీంతో అతడు పేరెంట్స్‌ను భయపెట్టాలని ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరి వేసుకున్నట్లు నటించాడు. కానీ దురదృష్టవశాత్తు అది మెడకు బిగుసుకుపోయింది. విలవిల్లాడుతున్న సిద్ధూను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.


