News March 18, 2025

కాసిపేట: సైకిల్‌పై నుంచి పడి ఒకరి మృతి

image

సైకిల్ పైనుంచి పడి ఒకరు మృతి చెందినట్లు కాసిపేట SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. SI కథనం ప్రకారం.. హాజీపూర్ మండలానికి చెందిన రాజయ్య(65) కాసిపేటలోని కుమారుడి ఇంటికి వచ్చాడు. రాజయ్య సైకిల్‌పై తన స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం వెతకగా మద్దిమాడ వద్ద పడి ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారన్నారు. కొడుకు మల్లేశ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News January 23, 2026

పిల్లలు ఎత్తు పెరగట్లేదా?

image

కొంతమంది పిల్లలు వయస్సుకు తగ్గట్లు ఎత్తు పెరగరు. ఇలా కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలంటున్నారు నిపుణులు. క్యారెట్, బీన్స్, బచ్చలికూర, బఠాణీ, అరటి, సోయాబీన్, పాలు, గుడ్లు డైట్‌లో చేర్చాలి. వీటిలో ఉండే కాల్షియం, మినరల్స్ పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. అలాగే రోజూ వ్యాయామం, సైక్లింగ్ చేయిస్తే గ్రోత్ హార్మోన్స్‌ పెరగడానికి దోహదం చేస్తాయి.

News January 23, 2026

TTD ట్రస్టులకు రూ.2.50 కోట్ల విరాళం

image

AP: TTDలోని పలు ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌ రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ.2.50కోట్ల భారీ విరాళాన్ని శుక్రవారం అందించింది. శ్రీవేంకటేశ్వర ప్రాణ, విద్యాదాన ట్రస్టులకు చెరో రూ.75లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50లక్షలు, అన్నప్రసాదం, గోసంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25లక్షల విలువైన డీడీలను TTD అదనపు EOకు సంస్థ అధినేత అందజేశారు.

News January 23, 2026

HYD: IT హబ్‌లో ‘సర్కారు’ కొలువు!

image

IT హబ్‌గా పేరుగాంచిన టీ-హబ్‌లో ఇకపై ఫైళ్ల సందడి కనిపించనుంది. స్టార్టప్‌లకు కేటాయించిన ఈ ఐకానిక్ బిల్డింగ్‌లోకి బేగంపేట డివిజనల్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసు మారుతోంది. ప్రైవేటు భవనాల అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో భాగంగా ఈ మార్పు జరుగుతోంది. ఇప్పటివరకు కార్పొరేట్ లుక్కుతో మెరిసిపోయే టీ-హబ్ వాతావరణం ఇకపై రెవెన్యూ అధికారుల రాకపోకలతో కళకళలాడనుంది.